DRDO Former Chairman Satheesh Reddy About Operation Sindoor : పాకిస్థాన్‌తో ఘర్షణ తీవ్రమవుతున్న పరిస్థితుల్లో భారత్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం శత్రువుకు వెన్నులో వణుకు పుట్టేలా చేసింది. తన అమ్ముల పొదిలోని బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను వ్యూహాత్మకంగా వినియోగించడంతో అప్పటి వరకూ అణ్వాయుధాలున్నాయంటూ ప్రగల్బాలు పలికిన దాయాది దేశం వెన్నులో వణుకుపుట్టింది.