TGSRTC Workers Strike Postponed : ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం అవ్వడంతో సమ్మె వాయిదా పడింది. ఉద్యోగుల సమస్యలపై ముగ్గురు ఐఏఎస్ అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. నవీన్ మిత్తల్, లోకేష్ కుమార్, కృష్ణభాస్కర్‌తో కమిటీ ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యల పరిష్కారం సూచించనుంది. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.