మూడు రోజులు గడిచాయి! ఆచూకీ కోసం అన్వేషణ ఆగలేదు. 8మంది జాడ కనిపెట్టేందుకు సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్యూ బృందాలు అలుపెరుగకుండా శ్రమిస్తూనే ఉన్నాయి. అయినా ఇప్పటికీ సానుకూలత కనిపించడం లేదు. ఇదీ ప్రస్తుతం శ్రీశైలం ఎడమగట్టు సొరంగం పైకప్పు కూలి ప్రమాద స్థలిలో నెలకొన్న పరిస్థితి. ఉత్తరాఖండ్లో జరిగిన విపత్తుల్లో రెస్క్యూ ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేసిన బృందాలు సైతం పాలుపంచుకుంటున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.