Duvvada Respond to Suspension : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను వైఎస్సార్సీపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆయణ్ని పార్టీ నుంచి తొలగించినట్లు మంగళవారం రాత్రి ప్రకటించింది. ఈ విషయంపై ఇవాళ దువ్వాడ స్పందించారు. తనను వ్యక్తిగత కారణాలతో అకారణంగా వైఎస్సార్సీపీ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిసిందని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.