Praja Samasyala Parishkara Vedika in Andhra Pradesh : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూతన ప్రభుత్వం శ్రీకారం చుట్టిన మీకోసం కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. వైఎస్సార్సీపీ పాలనలో స్పందన పేరిట తీసుకున్న అర్జీలు పరిష్కరించకపోవటంతో భారీగా దరఖాస్తులు రీ ఓపెన్ అయ్యాయి. ఒంగోలులోలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు అధికారులకు వినతులు అందజేశారు.