No Safety at Vijayawada Indrakeeladri: లోకాన్ని రక్షించే ఇంద్రకీలాద్రిపై ఉన్న జగన్మాత దర్శనార్థం వచ్చే భక్తులకు భద్రత ఉంటడం లేదు. ఏటా రెండు కోట్ల వరకు భక్తులొచ్చే దుర్గగడిలోని భద్రతా ప్రమాణాలు దయనీయంగా ఉన్నాయి. పేరుకు వందల కెమెరాలున్నా వాటిని పర్యవేక్షించే సిబ్బంది మాత్రం అంతంతమాత్రంగా ఉన్నారు. కనీసం సీసీ కెమెరాల దృశ్యాలు వీక్షించే తెరలు కూడా సరిగా లేవు. దీంతో నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.