Narayana Special Interview 2024 : భవిష్యత్లో వరదల వల్ల విజయవాడ నగరం మునిగిపోకుండా ఉండేలా ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వివరించారు. కృష్ణానదిపై మరో బ్యారేజీ నిర్మించడం సహా బుడమేరు డైవర్షన్ పనులు సత్వరం పూర్తి చేయాలని సీఎం నిర్ణయించారని పేర్కొన్నారు. ఆ పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా తెలంగాణలో హైడ్రా తరహాలోనే ఆపరేషన్ బుడమేరు పేరిట ప్రత్యేక కార్యక్రమం వీలైనంత త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ‘ఈనాడు - ఈటీవీ భారత్కు' ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.