CBI Former JD VV Lakshmi Narayana Interview: అనంతపురం జిల్లా ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) కేసులో హైదరాబాద్ సీబీఐ కోర్టు ఇచ్చిన తుది తీర్పుపై సీబీఐ పూర్వ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన వారికి శిక్షలు పడితేనే మిగతా వారిలో భయం కలుగుతుందని అన్నారు. ఈ తరహా ఘటనల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఓఎంసీ ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు దర్యాప్తు సమయంలో తనకు ఎదురైన కొన్ని అనుభవాలను సైతం పంచుకున్నారు. రెండు నిమిషాలు సైరన్లు మోగనున్నాయి. సైరన్ రాగానే ఎలక్ట్రిక్ పరికరాలు, లైట్లు, గ్యాస్ స్టవ్ లు ఆపాలని అధికారులు సూచించారు. సైరన్ మోగిన వెంటనే ప్రజలంతా బహిరంగ ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సమాచారం కోసం టీవీ, రేడియో ప్రభుత్వం యాప్లను వినియోగించుకోవాలని తెలిపారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు మాక్ డ్రిల్ పూర్తి కానుంది.