All India Civil Services 11th Ranker Sai Sivani Interview : యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసిన సివిల్స్-2024 తుది ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇట్టబోయిన సాయి శివాని 11వ ర్యాంకు సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆమెదే ఉత్తమ ర్యాంకు.
సివిల్స్ సాధించాలనేది చాలామంది కల. కానీ కల కంటేనే సరిపోదు. ఆ కలని సాకారం చేసుకునే దిశగా అడుగేయాలి. ఆహర్నిశలు శ్రమించాలి. అప్పుడే విజయం సాధిస్తారు. ఆ కోవకే చెందుతుంది వరంగల్‌కు చెందిన సాయి శివాని. సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని పుస్తకాలతో కుస్తీపట్టింది. ఫలితంగా ఆలిండియా సివిల్స్‌లో 11 వ ర్యాంకు సాధించి తెలుగు రాష్ట్రాల్లో టాపర్‌గా నిలిచింది. మరి, ఆమె విజయ ప్రస్థానం శివాని మాటల్లోనే విందాం.