POLICE ARRESTED DEVI RAO: విశాఖలో నిరుద్యోగులను మోసం చేసిన దేవీరావు బృందం పోలీసులకు చిక్కడంతో వారి ఆగడాలకు బలైన బాధితులు బయటకు వస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఆ పార్టీ చోటా నేతగా చలామణి అయిన దేవీరావును నమ్మి గ్రామీణ యువత పెద్ద సంఖ్యలో మోసపోయారు. దాదాపు 300 మంది బాధితుల వద్ద లక్ష నుంచి 15 లక్షల రూపాయల వరకు కాజేసిన ఆమెను ఒడిశాలో పట్టుకున్నారు. మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్కు తరలించారు.