Rape Attempted On A Young Woman in Medchal : ఆదివారం(ఏప్రిల్ 6) రాత్రి వేళలో ఓ యువతిపై గుర్తుతెలియని యువకులు అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారయత్నం చేసిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీంతో ఆ యువతి దుండగుల నుంచి తప్పించుకొని మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ అధికారిణితో విచారణ జరిపి కేసు నమోదు చేశారు. రైల్వే స్టేషన్లో జరిగిన ఘటన కావడంతో రైల్వే పోలీసులకు కేసు అప్పగించామని మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. కేసులో దర్యాప్తు కొనసాగుతుందని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వెల్లడించారు.