Police Catch Women Thieve in Ongole : మహిళలు, వృద్ధులే లక్ష్యంగా మత్తుమందు ఇచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ మహిళను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సినిమాలు, నాటికల్లో నేరాలు చేసే పాత్రలు చూసి ప్రభావితమైన నిందితురాలు అదే తరహాలో చోరీలకు పాల్పడేది. ఆమెపై గతంలోనే పలు స్టేషనల్లో కేసులు ఉన్నాయని గుర్తించిన పోలీసులు వాటిని దర్యాప్తు చేసి ఎట్టకేలకు ఆమెను చాకచక్యంగా పట్టుకున్నారు.