Municipal Commissioners Workshop: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో పేదలకు ఇబ్బంది కలిగించకుండా పన్ను బకాయిలను ఓ ప్రణాళిక ప్రకారం వసూలు చేయాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో పట్టణాలు, నగరాలు, నగర పంచాయతీల పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపై వర్క్‌షాప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. మున్సిపల్ శాఖపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా కమిషనర్లు పనిచేయాలని మంత్రి అన్నారు.