CM Chandrababu Meet With Representatives Of Aqua Sector : భారం పేరుతో ఆక్వా రైతులకు ఇచ్చే ధరలు తగ్గించవద్దని, 100 కౌంట్ రొయ్యలకు కిలోకు 220 రూపాయల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్వా ఎగుమతి వ్యాపారులకు సూచించారు. సుంకాల భారం నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సన చర్యల కోసం కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి జిల్లాల్లో ఆక్వా చెరువులకు కాలువల ద్వారా నీటిని సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.