YS Viveka Murder Case Accused Sunil Yadav Conduct Press Meet : హత్య సినిమా దర్శక, నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పులివెందుల వైఎస్సార్సీపీ నాయకులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ ప్రశ్నించారు. కోట్ల రూపాయలు సంపాదించానంటూ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి చేసిన ఆరోపణలను సునీల్ యాదవ్ ఖండించారు. తనకు కోట్ల రూపాయలు ఉంటే అద్దె ఇంట్లో ఎందుకు ఉంటానన్నారు. వివేకా కేసు కోర్టు పరిధిలో ఉన్నందున వైఎస్సార్సీపీ నాయకులు అనవసరంగా తనపై ఆరోపణలు చేసి వారి నెత్తికి తెచ్చుకోవద్దని హితవు పలికారు.