TDP High Command Angry on ITDP Activist : సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల విషయంలో సొంత పార్టీ కార్యకర్తలనూ టీడీపీ ఉపేక్షించడంలేదు. ఎవరు నోరు జారినా తప్పేనని మాటల్లో చెప్పడమే కాకుండా చేతల్లో కూడా చూపిస్తోంది. మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో జగన్ సతీమణి భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ తీరు పట్ల తెలుగుదేశం అధిష్టానం తీవ్ర అగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన తెలుగుదేశం కిరణ్‌ను పార్టీ నుంచి సప్పెండ్ చేసింది.