CM Chandrababu at All India Research Scholars Summit 2025: యువత ఉత్సాహం భవిష్యత్తు ఆవిష్కరణలకు నాంది పలుకుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. నూతన ఆవిష్కరణల సృష్టికర్తలు నేటి యువతరమే అని మద్రాస్ ఐఐటీలో నిర్వహించే ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చంద్రబాబు స్పష్టం చేశారు. ఐఐటీలో 30 శాతం విద్యార్థులు తెలుగువారు ఉండటం గర్వకారణమని తెలిపారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఎంత సంపాదిస్తాం అని సగటు విద్యార్థుల ఆలోచనలకు భిన్నంగా ఐఐటీ విద్యార్థులు ఉంటారని వెల్లడించారు.