KTR Comments On Organ Donation : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ అవయవ దానానికి ముందుకొచ్చారు. ఆర్గాన్ డొనేషన్‌కు తాను సిద్ధంగా ఉన్నట్లుగా అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతకు ముందు అవయవదానం బిల్లును శాసనసభలో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రవేశపెట్టారు. ఆర్గాన్ డొనేషన్ కోసం రాష్ట్రవిధానాన్ని రద్దు చేస్తూ బిల్లుపెట్టారు. ఇకపై కేంద్ర విధానానికి అనుగుణంగానే రాష్ట్రంలో అవయవదానం జరగనుంది.