PASTOR PRAVEEN DEATH CASE: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఆయన చనిపోవడానికి ముందు సీసీ కెమెరా దృశ్యాలు దర్యాప్తులో కీలకంగా మారాయని చెప్పారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేశామని, ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రవీణ్‌ను హత్య చేశారని, నిజాలు నిగ్గు తేల్చాలంటూ క్రైస్తవ సంఘాలు ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.