Police Arrested Three Persons On Dead Body Parcel Case : గతంలో ఎన్నడూ చూడని, ఎక్కడా వినని రీతిలో రోజుకో మలుపు తిరుగుతూ పూటకో సవాల్ విసురుతూ పోలీసు అధికార యంత్రాంగాన్ని ముప్పుతిప్పులు పెట్టి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ను తలపిస్తూ సాగిన చెక్కపెట్టెలో మృతదేహం కేసుకు ఎట్టకేలకు పశ్చిమ గోదావరి పోలీసులు ముగింపు పలికారు. అనుమానితుడే అసలు నిందితుడిగా నిర్థారించారు. మామ ఆస్తి కోసం భార్య, సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి వదినను బెదిరించడం ద్వారా ఆస్తిని కాజేయాలన్న కుట్రతో ఈ హత్యకు పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం ఏమీ తెలియని, పని కోసం వచ్చిన వ్యక్తిని బలిచేసినట్లు తేల్చారు.