Traffic SI Subba Rao Reveals Facts About Pastor Praveen Accident : పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్తూ ప్రవీణ్ మధ్యలో విజయవాడలో స్వల్ప రోడ్డుప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు ఆయనకు సాయం చేశారు. అతనికి తాగునీరు ఇచ్చి పక్కనున్న పార్కులో కూర్చోబెట్టారు. తాను హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళుతున్నానని ప్రవీణ్ ఎస్ఐకి చెప్పారు.