Pastor Praveen Case Updates : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన పాస్టర్ ప్రవీణ్ మృతి రోడ్డు ప్రమాదం వల్లే సంభవించిందని పోలీసులు తేల్చారు. దీనికి సంబంధించిన వివరాలను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ రాజమహేంద్రవరంలో మీడియాకు వెల్లడించారు. ఆయన దారిలో వెళ్తుండగా పలువురితో మాట్లాడారని చెప్పారు. ఇందులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించామన్నారు. ఈ కేసులో 92 మందిని విచారించామని తెలిపారు. ప్రవీణ్ మృతిపై వారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదని ఐజీ వివరించారు.