Vizag Honey Trap Case Updates : ప్రేమ, పెళ్లి, స్నేహం ముసుగులో మాయగాళ్లే కాదు కిలేడీలు వలపు వల విసురుతున్నారు. తమ మాటలు నమ్మి దగ్గరైన వారి బలహీనతలను అవకాశం చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ముందుగా మేసేజ్లతో ముగ్గులోకి దించుతారు. ఆ తర్వాత పర్సనల్గా కలుద్దామని చెబుతారు. టెంప్ట్ అయి ముందడుగు వేస్తే అందినకాడికి దోచేస్తారు. ఇలాంటి ఘటనే విశాఖలో వెలుగుచూసింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మాయా లేడి ముఠా గుట్టును రట్టు చేశారు.