Hyderabad MMTS Train Incident Case Updates : హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం కేసులో జీఆర్పీ పోలీసులు విచారణం వేగవంతం చేశారు. 4 బృందాలుగా విడిపోయి నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. నిందితుడు బలత్కారం చేస్తున్న క్రమంలో కదులుతున్న రైలు నుంచి కిందకు దూకిన యువతి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అయితే బోగీలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసును ఛేదించడం పోలీసులకు సవాలుగా మారింది. యువతిని మెరుగైన చికిత్స కోసం గాంధీ నుంచి యశోద ఆస్పత్రికి తరలించారు.