Leopard Death Case: ఉచ్చు అమర్చి చిరుతను చంపిన కేసు విచారణను అటవీశాఖ అధికారులు వేగవంతం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పీసీసీఎఫ్ చలపతిరావును విచారాణాధికారిగా నియమించారు. కాగా అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని పొన్నూటి పాలెం అటవీ ప్రాంతంలో ఉచ్చులో పడి మరణించిన చిరుత ప్రదేశాన్ని క్షుణ్ణంగా ఆయన పరిశీలించారు. జంతువులకు తాగునీటి వనరులు లభ్యమయ్యే చోటు, అడవి జంతువులు తిరగడానికి అనువుగా ఉండే ప్రదేశాలతో పాటు పరిసర ప్రాంతాలు పరిశీలించారు.