Coringa Wildlife Sanctuary: గోదావరి జలాలు సముద్రంలో కలిసే సుందర పర్యాటక ప్రాంతం. దట్టమైన మడ అడవులున్న వణ్యప్రాణి సంరక్షణ కేంద్రం. విభిన్న జీవరాశులకు ఆలవాలమైన రక్షిత ప్రాంతం కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరింగ అభయారణ్యం. ఇక్కడ చుట్టేస్తున్న కాలుష్యం జీవరాశులతోపాటు పర్యావరణానికీ ముప్పుతెస్తోంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ప్రాంత సంరక్షణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎకో టూరిజానికి కేంద్ర బిందువైన కోరింగ పరిరక్షణకు అధికార యంత్రాంగం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఏర్పడింది.