Girl Child Death in Punganur: చిత్తూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపిన చిన్నారి హత్య ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. చిన్నారి హత్యపై వస్తున్న నిరాధార ఆరోపణలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కుటుంబసభ్యులను మంత్రులు పరామర్శించారు. నిందితులను వదలబోమని తెలిపారు. మరోవైపు ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ మణికంఠ చందోలు వెల్లడించారు. బాలికపై అత్యాచారం జరగలేదని పోస్టుమార్టం నివేదికలో తేలిందన్నారు. ఆర్ధిక లావాదేవీలతో బాలికను హత్య చేసినట్లు ఎస్పీ తెలిపారు.