CRZ regulations Violation: విశాఖ సాగరతీరంలో సీఆర్జెడ్ (Coastal Regulation Zone) ఉల్లంఘనలు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో టూరిజం రిసార్ట్స్ పేరిట సాగరతీరంలో ఒక భాగాన్ని దక్కించుకున్న గుత్తేదారు ఏకంగా సబ్ లీజులకు ఇచ్చి మరీ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. దీనిపై హైకోర్టు గట్టిగా మొట్టికాయలు వేస్తున్నా అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడటం లేదు.