Jagananna Colonies Electricity Scam : జగనన్న హౌసింగ్ కాలనీలకు విద్యుత్ పనులు, మెటీరియల్ ధరల విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు విస్తుగొలుపుతోంది. కరెంట్ కనెక్షన్లు కల్పించే పనుల్లోనే రూ.500 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు అంచనా వేశారు. మూడు డిస్కంలు ఒకే ధరకు సామగ్రి కొనలేదు. గుత్తేదారులకు పనుల కేటాయింపులోనూ ఒక పద్ధతి పాటించలేదు. కాంట్రాక్టర్లు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.