Minister Uttam Kumar on SLBC : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షించారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సొరంగంలో సుమారు 7 నుంచి 9 మీటర్ల ఎత్తున మట్టి పేరుకుపోయింది. ప్రధాన అడ్డంకిగా ఉన్న చివరి మీటర్లలో నీరు ప్రవహిస్తోంది. పూడుకున్న మట్టి తీస్తే తప్ప టీబీఎం ముందు భాగానికి వెళ్లలేని పరిస్థితి ఉంది.