MUMBAI ACTRESS CASE: వైఎస్సార్సీపీ హయాంలో పోలీసు అధికారుల వేధింపుల వ్యవహారంపై ముంబయి నటి విజయవాడ పోలీసులకు చేసిన ఫిర్యాదులో కీలక వివరాలు వెల్లడించారు. తనపై కేసు నమోదుకు ముందే ముంబయిలో రెక్కీ నిర్వహించారన్న ఆమె ఆ తర్వాతే విద్యాసాగర్‌తో ఫిర్యాదు ఇప్పించి తనపై కేసు పెట్టారని చెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నట్లు సమాచారం. తాను పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు ముంబయిలో కేసు ఉపసంహరణకు ఒత్తిడి చేశారని, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.