Adani Letters to AP Govt: ఒప్పందం మేరకు సౌర విద్యుత్ తీసుకునేందుకు సిద్ధం కావాలని సెకీ ద్వారా అదానీ సంస్థ ఒత్తిడి పెంచుతోంది. ఏప్రిల్ నుంచి సరఫరా అదానీ సంస్థ విద్యుత్ సరఫరా చేస్తోందంటూ సెకీ పదేపదే లేఖలు రాస్తోంది. అటు అదానీ సిబ్బంది సైతం పదేపదే ఇంధనశాఖ ఉన్నతాధికారులను కలిసి విద్యుత్ కొనుగోలుపై ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై ఎలా స్పందించాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.