AP GOVT ABOUT BIFURCATION ISSUES: విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లోని సంస్థల ఆస్తులన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి నిధులతోనే ఏర్పాటు చేసినందున జనాభా ప్రాతిపదికన వాటిని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శికి స్పష్టం చేసింది. ఈ షెడ్యూల్లోని సంస్థలను విడివిడిగా కాకుండా అన్నింటినీ ఒకేసారి పంపిణీ చేయాలని కోరింది.