Revenue Complaints Pending in AP : ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులను పరిష్కరించడంలో రెవెన్యూ యంత్రాంగం నాన్చుడు ధోరణిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నా జిల్లాల్లో పరిష్కార చర్యలు తీసుకోవడంలో వేగం కొరవడుతోంది. వివిధ మార్గాల్లో గతేడాది జూన్ 15 నుంచి ఇటీవల వరకు రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రభుత్వానికి సుమారు 3.53 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఇప్పటివరకు 1.71 లక్షల అర్జీలను మాత్రమే పరిష్కరించినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. పరిష్కారమైనట్లు చెబుతున్న వాటిలోనూ కొన్ని దరఖాస్తులపై తీసుకున్న చర్యలు కాగితాలపైనే ఉన్నాయని సమచారం.