Union Minister Murugan on Central Budget for AP: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం కల్పించినట్లు కేంద్రమంత్రి మురుగన్ తెలిపారు. రాజధాని అమరావతికి మరింత ప్రాధాన్యం ఇచ్చిన విషయం గుర్తు చేశారు.వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించినట్లు చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు చాలా కీలకమని త్వరగా సత్వరం పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. విశాఖ - చెన్నై, హైదరాబాద్ - బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లకూ బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు.