Kandukuri House Damaged : కందుకూరి వీరేశలింగం పంతులు ఓ సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికుడు, సాహతీవేత్త, స్త్రీ జనోద్ధరణ కోసం జీవితాన్ని అర్పించిన త్యాగధనుడు. ఆ మహనీయుడు జన్మించి, నివసించిన గృహం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ఎటుచూసినా చెదలు పట్టిన దూలాలు, బీటలు వారిన గోడలే. కనీస నిర్వహణ, మరమ్మతులు లేకపోవడంతో కళావిహీనంగా దర్శనమిస్తుంది. భావితరాలకు భద్రంగా అందించాల్సిన రాజమహేంద్రవరంలోని కందుకూరి జన్మగృహం ప్రస్తుతం నిర్లక్ష్యపు చెదలు పట్టి మసకబారుతోంది.