Ponds Encroachment in Kurnool : చెరువులు, వాగులను కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలు వైఎస్సార్సీపీ హయాంలో తామే స్వయంగా రంగంలోకి దిగి వాటిని యథేచ్ఛగా కబ్జా చేశారు. అధికారులు సైతం కళ్లు మూసుకుని వాటికి అనుమతులూ ఇచ్చేశారు. ఆక్రమించిన స్థలం చుట్టూ దర్జాగా భారీ ప్రహరీ నిర్మించుకుని కోట్లాది రూపాయల విలువ చేసే విల్లాలు నిర్మిస్తున్నారు.