Grains Procurement Problems: ప్రభుత్వాలు మారుతున్నా, ధాన్యం సేకరణలో అధికారుల తీరుతెన్నులు మారడం లేదు. తేమశాతం మొదలు అనేక ఇతర కారణాల పేరిట రైతులకు అడుగడుగునా సతాయింపులే ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వ విధానాల వల్ల ఎన్నడూలేనంతగా ఇబ్బందులుపడ్డ అన్నదాతలు, ప్రభుత్వం మారాకైనా పరిస్థితి మారుతుందని ఆశించారు. కానీ అవే విధానాలు కొనసాగుతున్నాయని నిరాశ వ్యక్తం చేస్తున్నారు.