PAWAN KALYAN GRAMA SABHA: అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయని, గ్రామాలు పచ్చగా ఉంటే మనమంతా హాయిగా ఉంటామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన తనకుందని తెలిపారు. అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లెలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొని పవన్ ప్రసంగించారు.