Farmers on Loan Waiver Issues : మూడు విడతల్లో రుణమాఫీ ప్రక్రియ సాగుతున్న వేళ కర్షకుల్లో ఆనందం నెలకొంటే వివిధ సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో మాఫీ కాని అన్నదాతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తుందని కొండంత సంబరపడ్డా అన్ని అర్హతలు ఉన్నా తమకు మాఫీ కాలేదంటూ రైతులు ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలంటూ అధికారులు, యంత్రాంగానికి మొర పెట్టుకుంటున్నారు. ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మండలాల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రుణమాఫీ ప్రజావాణికి బాధిత రైతులు బారులు తీరుతున్నారు.