Balineni Srinivasa Reddy Comments: వైఎస్సార్సీపీ నాయకుడు చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి తనపై చేసిన విమర్శలను జనసేన నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి కూడా తనను విమర్శించే వాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అయిదేళ్ల పరిపాలనపై చర్చించేందుకు చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి ముందుకు వస్తే తాను సిద్ధమని బాలినేని సవాల్ విసిరారు. తాను విలువలు లేని రాజకీయాలు చేయనని బాలినేని స్పష్టం చేశారు. జనసేన పార్టీలో చేరినప్పుడే తాను ఎవరినీ విమర్శించనని, తనను విమర్శిస్తే చూస్తూ ఊరుకోనని, వాస్తవాలు చెప్పాల్సి వస్తుందని స్పష్టం చేసినట్లు తెలిపారు.