Government Hospital Palnadu District:ఆస్పత్రి అంటేనే వైద్య పరికరాలు, ల్యాబ్‌లు, పడకలు. కానీ అక్కడ అవేమీ ఉండవు. అంతేకాదు కనీసం తాగునీరు, విద్యుత్ లాంటి మౌలిక వసతులు కూడా లేవు. ఇవన్నీ లేకుండానే వైద్యశాలను ప్రారంభించారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! ఈ ఘనత కేవలం వైసీపీ ప్రభుత్వానికే చెల్లింది. గత పాలకులు ప్రజారోగ్యాన్ని ఎలా విస్మరించారో దీన్ని బట్టి అర్ధమవుతుంది.