Steps to Build ESI Hospital in Guntur : గుంటూరు జిల్లా కార్మికుల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఈఎస్ఐ(ESI) ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి కీలక అడుగు పడింది. 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు కేంద్రం పచ్చజెండా ఊపింది. నిర్మాణం పూర్తయితే వేలాది మంది కార్మికులకు వైద్య సేవలు అందనున్నాయి.