చీకటిని పారదోలుతూ చెడు మీద గెలిచిన మంచికి గుర్తు దీపావళి. ప్రతి ఒక్కరీ మోములో సంతోషాలు వెల్లివిరిసే తరుణంలో పండగ పేరుతో కాల్చే టపాసుల వల్ల పంచభూతాలు కాలుష్యమవుతున్నాయి. మన సరదాల కోసం అద్భుతమైన వేడుకను పర్యావరణానికి శత్రువుగా మార్చేస్తున్నాం. కానీ కృష్ణా జిల్లా గూడవల్లికి చెందిన ఓ కుటుంబం పర్యావరణానికి హానికరమైన టపాసుల జోలికిపోకుండా దశాబ్దాలుగా దీపాల కాంతులతోనే పండుగను సంతోషంగా జరుపుకుంటోంది.