Diwali Shopping in Vijayawada : వెలుగుల పండుగ దీపావళి వచ్చేస్తోంది. ఇళ్లను దీపాల కాంతులతో నింపేందుకు మహిళలు సిద్ధం అవుతున్నారు. దీపావళి మరో నాలుగు రోజుల సమయం ఉన్నా ప్రజలకు కావాల్సిన సామాగ్రి అందుబాటులోకి వచ్చేసింది. విజయవాడలోని ప్రధాన మార్కెట్లలో ప్రమిదలు, కొవ్వొత్తులు దర్శనమిస్తున్నాయి. భిన్న ఆకృతుల్లో ప్రమిదలు కొనుగోలు దారులను ఆకట్టుకుంటున్నాయి. నీళ్లలో తేలియాడే దీపాలు, పూలను తలపించే కొవ్వొత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దైవారాధన కోసం ప్రమిదలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.