Constable Commits Suicide Over Ganja Accusations : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానిస్టేబుల్ సాగర్ ఆత్మహత్యకు యత్నించే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏనుకూరుకు చెందిన సాగర్ బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేశాడు. గతంలో బూర్గంపాడుకు చెందిన భారాస నాయకుడు.. అప్పటి ఎస్ఐతో సన్నిహితంగా ఉండి గంజాయి పక్కదోవపట్టించినట్టు ప్రచారం జరిగింది. గంజాయి లావాదేవీలన్నీ సాగర్ సెల్‌ఫోన్ ద్వారా మాట్లాడే వారని తెలిసింది.