Aswaraopet SI Suicide Incident : అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబానికి సహచర పోలీసులు అండగా నిలిచారు. ఏపీ, తెలంగాణ పోలీసు సంక్షేమ సంఘం 2014 బ్యాచ్‌కు చెందిన పలువురు ఎస్సైలు కలిసి రూ.25 లక్షల చెక్కును శ్రీనివాస్ కుటుంబానికి అందించారు. అతని ఇద్దరు పిల్లల విద్యాభ్యాసానికి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. అశ్వరావుపేట ఎస్సైగా విధులు నిర్వహించిన శ్రీరాముల శ్రీనివాస్, తోటి సిబ్బంది వేధిస్తున్నారంటూ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.