Couple Commits Suicide Due to Debts: బిజినెస్ చేస్తున్నానని నమ్మించి తల్లిదండ్రులతో అందినకాడికి అప్పులు చేయించాడో కుమారుడు. దాదాపు 2 కోట్ల 40 లక్షల రూపాయల వరకూ అప్పులు చేయించి నగదును సొంతానికి వాడుకుని తల్లిదండ్రులను నిండా ముంచేశాడు. దీంతో అప్పులు తీర్చే దారిలేక ఆ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది.