Medico Attempts Suicide In Siddipet : వైద్యవిద్యలో అడ్మిషన్ పొంది వారం రోజులు కూడా అవ్వక ముందే ఓ మెడికో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, మెడికల్ కళాశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన గాయత్రి అనే విద్యార్థిని సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో గల సురభి మెడికల్ కళాశాలలో మొదటి ఏడాది చదువుతుంది.