BFSI Courses Launches in Telangana : పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు అందించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మాసబ్‌ట్యాంక్‌లో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్‌ను ఆయన ప్రారంభించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, డీఎస్సీ, గ్రూప్స్ విభాగాల్లో మరో 35 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టామని తెలిపారు. త్వరలో మరో 35 వేల పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు.